Friday, January 9, 2009
"పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు"
డబ్బులు సంపాదించుకొన్నప్పుడు పొగిడిన నోళ్ళే ఆయనను తెగడుతున్నాయి. HE, SHE and "I.T." అన్న చందాన మూడేళ్ళ మూడక్షరాల కొర్సులు డొనేషన్లు కట్టి ప్రయివేటు కాలేజీల్లో చదివి అయిదంకెల జీతాలు 22 సంవత్సరాలకే సంపాదించి real estate, culture, language and Life style దేశ వ్యాపార మౌళిక స్వరూపాన్నే త్వర త్వర గా మార్చేసి ప్రజల భూముల్ని ఒక్కో desk top కి 10 ఎకరాలు అప్పణం గా సమర్పించేసి మన జీవన వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన యీ He, She and it ల లోని "I.T." వీరులు ఆకాశం లోనే చూశారు. గోరు చుట్టు మీద రొకటి పోటు లా యీ Recession; కుక్క గొడుగుల్లాటి కంప్యూటర్ కాలేజీలు యీ రోజు యువత కి జీవనోపాధిని చూపించ లేక పోయాయి. Trade, Engineering and manufacturing కి కాణాచి కావల్సిన దేశనికి యీ దౌర్భాగ్యపు స్థితి ని కలుగచేసింది. ఇవన్నీ చూసి కూడా సరి అయిన మార్గాన్ని చూపించాల్సిన మన నేతలకి సరి అయిన జ్ఞానం కూదా లేదు. భగవంతుడా !! నువ్వే యీ దేశాన్ని యీ యువతనూ రక్షించాలి. తల్లి తండ్రుల ఆత్మ క్షొభ నూ నివారించాలి. పరుగెట్టి పాలు తాగే సామెత గుర్తుకొస్తోంది.
Subscribe to:
Posts (Atom)